Thursday, July 7, 2016

Moral stories - kondapalli dolls- Handicrafted moral stories

The Hunter And The Doves
working for moral stories concept is not a simple thing.
When we got an opportunity to work we also have to study the story part too...
we have worked on pigeons and hunter or The Hunter And The DovesThere are lot of versions available in the net

one version is...
Flocks of pigeons lived on a Banyan tree. one day the pigeons were flying in search of food they saw plenty of grains on the ground.but its a hunter's trap

second version is...
Flocks of pigeons lived on a Banyan tree...a hunter came and saw the birds spread the net ...pigeons fell in the trap...

Third version is...
A long time ago, there was a huge banyan tree that stood at the outskirts of a small village. Many kinds of birds had their nests on this tree. Travellers, too, used to stop by for rest under the tree’s shade.
One day, a fowler happened to come to the tree. He saw that many types of birds lived there. So, he set up his net below the tree and scattered a few grains of rice to attract the birds there.
But, a crow who lived on the tree had seen the hunter setting up the net and warned the other birds not to go down to eat the grains.

But, at the same time, a flock of doves were flying past the banyan tree. They saw the grains of rice scattered around the tree and went down to eat them. Suddenly, a huge net fell over them and trapped them.

Iam not convinced ...


when I google about pigeons I found somuch of intresting points to be noted when we are writing a story...

1.A study published by two University of Iowa researchers in the March 31 issue of the Journal of Vision found that pigeons recognize a human face's identity and emotional expression in much the same way as people do.

2. Pigeons are considered to be one of the most intelligent birds on the planet and able to undertake tasks previously thought to be the sole preserve of humans and primates. The pigeon has also been found to pass the ‘mirror test’ (being able to recognise its reflection in a mirror) and is one of only 6 species, and the only non-mammal, that has this ability. The pigeon can also recognise all 26 letters of the English language as well as being able to conceptualise. In scientific tests pigeons have been found to be able to differentiate between photographs and even differentiate between two different human beings in a photograph

so its not easy to trap them...that to all the animals and birds live in the forests are super intelligents.
Flock of pigeons saw the grains they came down and trapped in to the net ...I don't think it is possible
so  I started working in this concept ..it took almost  four months to complete the story...


Now my version of the story I will write in The blog soon.,,,

But here is the story we made in four boards
1. Hunter spreading the net
2. watching them
3. birds flying after they came to know its a trap along with the net...
4. Reached their friend
their friend along with other friends helping them to release from the net.




Except The mouse and birds for rest of the boards, Hunter we used Natural and organic colors...
And no where we have used plastic in this total story part..

Monday, May 16, 2016

శ్రీరామ్ సమృద్ధి - The Art of life - Facebook Recognition

శైలబాల గారు ఎక్కడా కనబడటం లేదు

Facebook లో కూడా updates ఏమి లేవు

పిల్లనగ్రోవి నవల ఎంతవరకు వచ్చింది ?

అందరు బావున్నారు కదా ...

ఇలా కామెంట్స్, మెయిల్స్ చేసిన వారందరికి ధన్యవాదాలు

గత రెండేళ్లుగా నేను, నా బృందావనం గ్రూప్ సభ్యులం కలిసి సాధించిన చిన్న విజయం ఇది


పేస్ బుక్ వారు మమ్మల్ని గుర్తించిన వీడియో

పాల్గొన్న రాధిక గారికి ధన్యవాదాలు


మరింత వివరంగా మరో పోస్ట్ లో పంచుకుంటాను ...

మరోసారి అందరికి ధన్యవాదాలు

Wednesday, March 2, 2016

కాకి - కుండ ...

ఈ మధ్య శ్రీరామ్ సమృద్ధి  ఆన్లైన్ స్టోర్ కోసం మోరల్ స్టోరీస్ కాన్సెప్ట్స్ తయారు చేసే బాధ్యత తీసుకున్నాను ... చిన్న పిల్లల కధలకి సంబంధించిన వర్క్ కదా ఆడుతూ పాడుతూ చేయచ్చు అనుకున్నాను ... పైగా ఈ సలహా ఇచ్చింది కూడా నేనే ... చిన్న పిల్లలికి కధలు చెప్పేటప్పుడు చక్కగా చెక్క బొమ్మలు ఉపయోగిస్తూ చెప్తే బావుంటుంది అని ... 

స్కూల్స్ వాళ్ళు మీరు బొమ్మలు తయారు చేసి ఇస్తే మేము కధలు చెప్పెస్తాము అన్నారు ... 

అలా అలా వెళ్లి కధలు చెప్పడంలో శిక్షణ ఇచ్చే ఓ ప్రముఖ organisation ని చేరింది ఈ వార్త.. ఇంకేముంది వాళ్ళు మాకు కూడా కావాలి అనేసారు ... 

సరే ముందుగా అందరికి తెలిసిన కాకి - కుండ కధతో మొదలు పెట్టాలి అని అనుకున్నాను ... 
చాలా సింపుల్ కదా 

 ఒక కాకి ... 

ఒక కుండ 

కొన్ని గులక రాళ్ళూ ... 

కొన్ని చెట్లు... అయిపొయింది ... 

కాని కాన్సెప్ట్ తయారు చేస్తున్నప్పుడు మొదలయింది అసలు కష్టం ... 

చిన్నప్పుడు చదువుకున్న కధ ఏంటంటే ... 

అనగనగా ఒక కాకి ... పాపం ఆ కాకికి బాగా దాహం వేసింది ... మంచినీళ్ల కోసం వెతికింది ... అలా వెతగ్గా వెతగ్గా ఎక్కడో ఒక చోట ఒక కుండ కనిపించింది ... తీరా చూస్తె అందులో నీళ్ళు ఎక్కడో అడుక్కి ఉన్నాయి ... దాంతో ఎం చేయాలా  అని అలోచించి కొన్ని గులక రాళ్ళు ఆ కుండలో వేసేసరికి నెమ్మదిగా నీళ్ళు  పైకి వచ్చాయి ... ఆ నీళ్ళు తాగేసి ఆ కాకి చక్కగా వెళ్ళిపోయింది ... 

ఇందులో ఎం కష్టం ఉంది అంటారా ?

1. అసలు కాకి ఎక్కడినుంచి ఎక్కడికి వెడుతోంది ?
ఇది మొట్టమొదటి ప్రశ్న 
ఒకవేళ ఆ కాకి అడవిలో నివాసం ఉండేది అయితే అడవిలో ఎక్కడ జలాశయాలు ఉంటాయో కాకికి తెలిసే ఉంటుంది కాబట్టి నేరుగా అక్కడికే వెళ్లి మంచి నీళ్ళు తాగుతుంది ...

2. పోనీ ఏదయినా ఊరిలో ఉంటే ..... 
ఊరిలో ఎక్కడ నీళ్ళు దొరుకుతాయో తెలుస్తుంది కాబట్టి వెతుక్కోనవసరం లేదు 
అంటే ఆ కాకి తనకి పరిచయం లేని ఊరికి వెళ్లి ఉండాలి లేదా వెడుతూ ఉండి ఉండాలి 
ఏదయినా పని మీద 
ఎవరినయినా చూడటానికి ...
అలా వెడుతూ ఉండగా మధ్యలో దాహం వేసింది 

మరి నీళ్ళ కుండ ఎక్కడ పెట్టాలి ?
అడవిలో కుండ ఎక్కడినుంచి వస్తుంది ఎవరయినా బాటసారులు వదిలి వెళ్ళినా ఆ కొంచం నీళ్ళు రోజుల తరబడి అలా ఉండవు కదా 
పైగా అడవిలో చక్కగా జలాశయాలు , కొలనులు ఉంటాయి పక్షులు, జంతువులూ నీళ్ళు తాగి చక్కగా ఆడుకుంటాయి అని చెప్పాలి గాని అడవిలో కుండ అందులో కొన్ని నీళ్ళు ... నాకు నచ్చలేదు 

పోనీ ఊళ్ళో ఎక్కడయినా ... 
అసలు చిన్న పిల్లలికి కధలు చెప్పేటప్పుడు అప్పటి కధల్లో ఉన్నా లేకపోయినా ఇప్పుడు మాత్రం చెప్పాల్సిందే ... 
ప్రతి ఇంటిముందు చిన్న చిన్న నీళ్ళ తొట్టెలు పెట్టాలి అని ... అందులో రోజు ఆ ఇంట్లో ఉండే పిల్లలు నీళ్ళు నింపాలి ... అప్పుడు బోలెడు పక్షులు, కుక్కలు, పిల్లులు, ఆవులు వచ్చి నీళ్ళు తాగి వెడతాయి అది  మన బాధ్యత అని కూడా చెప్పాలి ... కాబట్టి ఊళ్ళో ప్రతి ఇంటి ముందు నీళ్ళ తొట్టెలు ఉంటాయి కాబట్టి కుండ పెట్టడం కుదరదు ... 

పోనీ గుడి దగ్గర ... 
గుడి , బడి ... ఊరికి, వ్యక్తికీ మార్గదర్శకులు ... 
అన్నింటికన్నా ముందు గుడిలోనే అక్కడక్కడ ఈ నీళ్ళ తొట్టెలు తప్పకుండ పెట్టాలి .. కాబట్టి కుదరదు 
చివరికి పొలం మిగిలింది .. 

పొలం దగ్గర కుండ పెట్టాలి అన్న ఆప్షన్ నాకు నచ్చింది 
పనిలో పనిగా పిల్లలికి పొలం గురించి , వ్యవసాయం గురించి కూడా ఒకటో రెండో ముక్కలు చెప్పచ్చు కదా 

కాబట్టి ఫైనల్ గా కధ ఇలా రూపుదిద్దుకుంది 

అనగనగా ఒక కాకి 
ఆ కాకి వాళ్ళ బంధువుల్ని చూడటానికి వేరే ఊరికి బయల్దేరింది . వాళ్ళ అమ్మ, నాన్న కూడా వచ్చేవారే కాని ఊరిలో బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం ఉండటం వలన వాళ్ళు అక్కడికి వెళ్లి ఈ కాకి ని ప్రక్క ఊరికి వెళ్లి రమ్మన్నారు .. పైగా ఆ కాకి కూడా .... కాకి కాకి అనడం కాకుండా ఏదో ఒక పేరు పెట్టుకోండి ... ఎక్కడిదాకా వచ్చాము ఆ కాకి కూడా పెద్దది అవుతోంది కదా నాలుగు ఊర్లు మంచి చెడ్డ తెలుసుకోవాలని వాళ్ళ నాన్నగారు ఆ కాకిని వంటరిగా  వెళ్ళిరమ్మని చెప్పారు 

కాకి ... కాకికి పేరు ... కాకికి అమ్మ, నాన్న , బంధువులు ... 
ఏమి పర్వాలేదు ... 
ఇలా మనం చక్కగా చెప్పుకోవచ్చు ... అప్పుడే పిల్లలికి పక్షులకి, జంతువులకి కూడా కుటుంబాలు ఉంటాయి అని అర్ధం చేసుకుంటారు .. 

అలా ఆ కాకి వేరే ఊరికి బయల్దేరింది ... మార్గ మధ్యలో దాహం వేసింది ... 
ఈ దాహం వేయడం కాకి వేరే ఊరికి బయల్దేరుతున్నప్పుడే ఉండాలి ... తిరిగి వచ్చేటపుడు అయితే ఒకసారి అప్పటికే ప్రయాణం చేసింది కాబట్టి ఎక్కడ నీళ్ళు దొరుకుతాయో తెలిసిపోతుంది అప్పుడిక వెతుక్కోనక్కర్లేదు ... 

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ... 
ఆ కాకి తండ్రిగారు పెందరాడే బయల్దేరమని ... పోద్దుపోతే ప్రయాణం ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్పారు .. కాని కాకి చిన్నది కదా ఆకతాయినం కొద్ది .. స్నేహితులకి చెప్పి  బయల్దేరేసరికి ఆలస్యం అయిపొయింది .అలా మధ్యాహ్నం అయిపొయింది .... బాగా దాహం వేసింది ... నీళ్ళు ఎక్కడ కనబడలేదు చివరికి ఒక పొలం లో ఒక బావి కనబడింది .. 

ఇప్పుడు అంతా బోర్లు, మోటర్లు కదా ... బావి అంటే ఏంటో చెప్పాలి ... 
ఒక బావి ఉంటె బాగా వర్షాలు పడ్డప్పుడు తాబేళ్లు మన బావిలోకి వస్తాయి అని కూడా చెప్పచ్చు 
తాబేళ్లు బోలెడు ఏళ్ళు జీవిస్తాయి అని చెప్పచ్చు ... 

మనం చూడని మన ముత్తాత గారిని ., నానమ్మ గారిని అవి చూస్తాయన్న మాట ... 
బావుంటుంది కదా ... 

మన బావిలో ఒక తాబేలు మన ముత్తాత గారి కాలం నుంచి ఉంటే ఆ తాబేలు మనకి ఎంతో అపురూపంగా కనిపిస్తుంది కదా .. 

బావి అంటే ఏంటి ?
బోర్లు ఎందుకు వేయకూడదు ... కుదిరితే ఇంకుడు గుంటలు గురించి కూడా చెప్పేయచ్చు ... 

అ పొలం పని చేస్తున్న రైతు , రైతు భార్య అప్పుడే భోజనానికి వెళ్ళారు .. 
పొలం కాబట్టి చక్కగా మనం ఎక్కడ ఒక కుండ పెట్టిన ఎలాంటి ఆక్షేపేణ ఉండదు ... 
కాకి కుండ దగ్గరికి వెళ్ళింది ... 
కుండ లో ఎక్కడో అడుగున నీళ్ళు ఉన్నాయి ... 
కుండని వంచి నీళ్ళు తాగుదాం అని అనుకుంది కాని ఆ కుండ వంచడానికి దాని బలం సరిపోలేదు 

అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది 
మనకి ఏ  సమస్య వచ్చినా ప్రకృతిలో పరిష్కారం ఉంటుంది .... చక్కగా కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్ధించాలి ... లేదా మదర్ నేచర్ ని ప్రార్ధించాలి 

కాకి వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు చేసింది ... 
ఇలా చెప్పడం వలన చిన్న సమస్య రాగానే కంగారు పడకుండా పిల్లలు మనసులో నమస్కారం చేసుకోవడం ... ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకుంటారు ... దేవుడికి దణ్ణం పెట్టుకోండి అని చెప్పడం లో తప్పేమీ లేదు మనమేమి దేవుడికి పేరు పెట్టలేదు కదా ... ఈ మతం వాళ్ళు ఆ మతం దేవుడిని లేదా ఎవరికీ ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు తల్చుకోవచ్చు ... ప్రకృతితో అనుబంధం పెంచడం కూడా చాల అవసరం కదా .. 

వెంటనే ఆ కాకికి అక్కడ కొన్ని రాళ్ళు కనిపించాయి ... వాటిని ఏరి తెచ్చి ఒక్కోటి కుండలో వేసింది ... నీళ్ళు నెమ్మదిగా పైకి రావడంతో చక్కగా తాగేసింది ... 

ఇక ఈ కధలో నీతి ఏంటి ?
ఈ సృష్టిలో పనికిరానిది అంటూ ఏది ఉండదు ... 
గులకరాళ్ళే కదా అనుకుంటాము ... కాని అవే కదా నీటిని పైకి తేవడం లో సహాయం చేసాయి .. 
ప్రపంచంలో ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు ... ప్రాణం ఉన్నా లేకపోయినా ... అన్ని విలువయినవే ... విశిష్ట మయినవే ... 
ఎవరి విలువ వాళ్ళది ... ఎవరి ఔన్నత్యం వాళ్ళది ... 
దేనిని తక్కువ చేసి చూడకూడదు ... 

ఇది నేను తయారుచేయబోయే కాకి కుండ కధ థీమ్ 
ఒక్క కధ ... ఇప్పటికి పూర్తిచేసాము .. ఇంకా 99 కధలు ఉన్నాయి ... 

బొమ్మలు రెడీ అయ్యాక మీ అందరితో పంచుకుంటాను ... 
మరో కధతో మళ్ళి కలుద్దాం ...